నీ అస్తిత్వానికి దోహదం చేసే వాళ్లతో తిరుగు
అంటీ ముట్టనట్టు ఉండేవాళ్లతో వొద్దు;
వాళ్ల ఊర్పులు నోటంట నీరసంగా వస్తాయి;
ఈ దృశ్య ప్రపంచంతో కాదు,
నీ బాధ్యత చాలా గంభీరమైనది.
గాలిలోకి ఎగరేసిన మట్టి ముక్కలై రాలిపోతుంది.
నువ్వు ఎగరడానికి ప్రయత్నించకపోతే,
ఎగిరి నిన్ను అలా ఖండ్ఖండాలుగా చేసుకోకపోతే,
మృత్యువే నిన్ను ముక్కలుముక్కలు చేస్తుంది,
అప్పుడు నువ్వు ఏదవుదామనుకున్నా సమయం మించిపోతుంది.
ఆకులు పండిపోతాయి. చెట్టు కొత్త వేరులు తొడుగుతుంది
ఆకుల్ని పచ్చగా మార్చుకుంటుంది.
నీకింకా పండి పాలిపోయిన ప్రేమపట్ల సంతృప్తి ఎందుకు?
.
జలాలుద్దీన్ రూమీ
1207 – 17 December 1273
పెర్షియను కవి
.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
వ్యాఖ్యానించండి