నీ కోసం నా తోటా, నా ఉద్యానమూ,
నిద్రపోక ఎదురు చూసే పెంపుడు కుక్కలూ,
నా జీవితాన్ని ముందే హేమంతంలోకి నెట్టిన
నా వసంతంలాంటి వయసూ…
ఒక భయాన్నీ, ఒక అదురుపాటునీ,
ఆరని మంటలాంటి ప్రతిభనీ,
నిస్సహాయంగా వీడ్కోలుపలికే రక్తపుజీరల
కన్నులలో నా ప్రతిబింబాన్నీ వదిలిపెట్టేను.
నది ఒడ్డున విషణ్ణలైన పావురాయిల్నీ,
మైదానంలో గుర్రాలనీ, నిన్ను చూడడానికి
కమ్మని సముద్రపు సుగంధాన్ని వదిలిపెట్టేను.
నీ కోసం నాదనుకున్న ప్రతీదీ విడిచిపెట్టేను.
ఓ రోము మహానగరమా! నా బాధలకీ, నిన్నుపొందడానికి
వదులుకున్నవన్నిటికీ, … తగినప్రతిఫలాన్ని ప్రసాదించు!
.
రఫేల్ ఆల్బెర్టి
16 December 1902 – 28 October 1999
స్పానిష్ కవి.
.
![]()
వ్యాఖ్యానించండి