మనం ప్రపంచాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి
తిరిగి అతకబోతే మనం వాటితో ఏమిటి తయారుచెయ్యగలం?
మనం కొండదగ్గరకి వెళ్ళిచూస్తే,
అది ఒకప్పటి మాహా పర్వతం అయి ఉంటుంది;
మనం సన్నగా పారుతున్న సెలయేటిని చూస్తే
అది ఒకప్పటి మహా నది అయి ఉంటుంది;
గాలికి చెల్లాచెదరైన ఓక్ చెట్ల పొదల్లో తిరుగాడబోతే
అదొకప్పటి కారడవి అయి ఉంటుంది;
మనకపుడు తెలుస్తుంది మనం వెనక్కి మళ్ళి
వచ్చినతోవనే తిరిగి రాలేమని,
కనీసం ‘ఈ క్షణం’ మనల్ని దాటి పోతున్నప్పుడు
ఉన్నచోట ఉన్నట్టుగా ఉండలేము.
మనసులాగే మన తర్వాతి లక్ష్యానికి పరిగెడతాం;
మనసుకోరిన రీతిలో మన జీవితాల్ని మలుచుకుంటాం.
కానీ మరుక్షణం మనం ఏది చేశామో దానికి
‘హయ్యో! లాభం లే’ దని నిరుత్సాహపడతాం.
ఆ విరిగిపోయిన ముక్కలతో జీవితాన్ని తిరిగి అతుకుదామనుకుంటాం.
కానీ మనం ఈ మట్టిని … ఎలా వచ్చిందో అలాగే స్వీకరించాలి.
మన జీవితాలని ఎంత వీలయితే అంతగొప్పగా మలుచుకోవాలి…
ఎప్పటికప్పుడు, మారుతూ, మనకు తగినట్టుగా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ.
.
మేరీ ట్యూడర్
(1870 -)
వ్యాఖ్యానించండి