(కీట్స్ ఈ కవితలో కొన్ని ప్రత్యక్ష ఉపమానాలనీ, కొన్ని పరోక్ష ఉపమానాలనీ పొందుపరచాడు. అయితే ముఖ్యమైనది బమ్మెరపోతన గారు భాగవతంలో చెప్పిన “ఇంతింతై వటుడింతయై” అన్న పద్యంలాంటి … అనుభూతులలోని సరిపోలిక. అంతవరకు ఖగోళ శాస్త్రజ్ఞులకి తెలియని ఒక గ్రహాన్ని ఒక శాస్త్రజ్ఞుడు చూసినపుడు కలిగే అనుభూతీ, వినడమే తప్ప అటువంటి మహాసాగరం ఉంటుందని తెలియనప్పుడు దాన్ని మొట్టమొదటిసారి ఒక ఉన్నతమైన కొండశిఖరం మీదనుండి దర్శించినపుడు కలిగే అనుభూతి, నిరుపమానమైనవి. కొన్ని అనుభూతులు మొదటిసారి అనుభవించినపుడు కలిగే ఆనందపారవశ్యం, ఆవేశాల కలగలుపు, నిర్వచనాల పరిథికి అందనిది. పరోక్షంగా హోమరు ఒక ప్రశాంతమహాసాగరమూ, ఒక వినూత్న గ్రహము వంటివాడని చెప్పక చెబుతున్నాడు. ఒకటి లౌకికము, రెండోది అలౌకికము.)
వ్యాఖ్యానించండి