నన్ను విడిచిపెట్టావు… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

ప్రియతమా! నాకు రెండు వారసత్వంగా వదిలావు.

మొదటిది ప్రేమ వారసత్వం.

భగవంతుడికే గనక ఆ వారసత్వం దక్కుంటే

ఎంతో సంతోషించేవాడు.

 

అనంత సాగరాల్లాంటి

ఎల్లలు లేని బాధనీ వదిలావు,

కాలానికీ అనంతానికీ మధ్య

నన్నూ, నీజ్ఞాపకాన్నీ మిగిల్చి.

.

ఎమిలీ డికిన్సన్

 December 10, 1830 – May 15, 1886

అమెరికను కవయిత్రి

 

.

You left me

.


You left me, sweet, two legacies,—

A legacy of love

A Heavenly Father would content,

Had He the offer of;

 

You left me boundaries of pain

Capacious as the sea,

Between eternity and time,

Your consciousness and me.


.


Emily Dickinson 

December 10, 1830 – May 15, 1886

American

 

Poem Courtesy:

http://users.telenet.be/gaston.d.haese/dickinson_love.html

 

“నన్ను విడిచిపెట్టావు… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి” కి 2 స్పందనలు

  1. “ప్రేమ బాధ అనే రెండు ఒడ్లుగల నది, జీవితమంటే” అని కవయిత్రి అభిప్రాయమంటారా?

    మెచ్చుకోండి

    1. నమస్కారం శర్మగారూ.
      చక్కగా చెప్పారు. ఈ రెండూ జమిలిగానే ఉంటాయి. అది తల్లి ప్రేమ అయినా, బిడ్డలప్రేమ అయినా, వయసులో ఉన్నవాళ్ళ ప్రేమ అయినా. ప్రతి ప్రేమ వెనక ఆ ప్రేమించే వ్యక్తిపట్ల అపురూపమైన (సాన్నిహిత్య)కోరిక, అది పొందలేనపుడు, పోగొట్టుకున్నప్పుడు జ్ఞాపకాలలో పొందే బాధ రెండూ ఒక నాణేనికి రెండు పార్శ్వాలే. అందుకే ప్రేమించడం అంత సులువు కాదు. చాలామంది భ్రమపడే ప్రేమ ప్రేమ కాదు. అది కేవలం ఒక ఆకర్షణ. ప్రేమ ఎప్పుడూ మనిషిని ఉదాత్తుని చేస్తుంది. త్యాగాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో కోరుకుంటుంది. జీవితంలో నిజంగా గ్రాడ్యుయేట్ ని చేస్తుంది.
      అభివాదములతో

      మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.