సూర్యుడు పసిడికిరణాలని వడకడుతున్నాడు
సూర్యుడు నిశ్శబ్దాన్ని కూడా వడకడుతున్నాడు.
ఆకాశంలో మేఘాలు మిరిమిట్లుగొలుపుతున్నాయి.
తెమ్మెర వీస్తున్న పూదోటలో నడుస్తున్నాను
ఎండిపోయిన పండుటాకులను కాళ్లతో తొక్కుకుంటూ…
పాలరాతి పలకమీద ఆకులు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి
దాని మీద ప్రేమికులు మౌనంగా కూచున్నారు;
ఆకులు ఖాళీ బల్లమీద చెదురుమదురుగా పడి ఉన్నై.
అదిగో అక్కడి తేటనీటికొలను, వణుకుతున్నట్టు,
సూర్యుడి వేడి కిరణాల్ని అలలతో జాడిస్తోంది.
దూరాన పొడవాటి ఒంటరి చెట్టు, అసహనంగా
ఆకాశంక్రింద ఎండలో ఊగుతోంది.
ప్రియతమా! నేను ఒంటరిగా నడుస్తున్నాను.
నా పాటతో స్వరం కలిపే ఈ కల ఏమిటి?
ఎప్పుడూ వెలుగులోనే ఎందుకు పాడుతుంది ?
ఇసుకమేటల మధ్యన అదిగో
ఆకాశం తెరలుతెరలుగా కనిపిసోంది.
వెలుగుచారలు పడ్డ నీలి కెరటాలు
నిప్పులా ఇసుకమేటల్లో చొచ్చి చప్పుడుచేస్తున్నాయి.
నురగలను తాకుతూ దిగంతాలకెగరడానికి
సీ-గల్ తన రెక్కలు బార్లాజాపింది,
దానితోపాటే ఒక నీలినీడకూడా వ్యాపింపజేస్తూ.
సీ గల్ తన రెక్కలు ముడుచుకుంటోంది
గాలిలో ఒకొక్క ఎత్తూ క్రిందికి దిగడానికి
ఎక్కడచూసినా ఆకాశమే కనిపిస్తోంది దానికి.
.
కాన్రాడ్ ఐకెన్
August 5, 1889 – August 17, 1973
అమెరికను కవి
.
.
Variations XVIII
.
వ్యాఖ్యానించండి