ఓహ్, నా అహాన్ని అణచడానికిగాని,
నా అభిప్రాయాల్ని వంచి మార్చడానికిగాని
నువ్వెన్నడూ ప్రయత్నించలేదు కనుక…
ఆదిమ మానవుడిలా
నేను సగం భయంతో జీవించేలా చెయ్యలేదు గనుక…
ఏదో విజయ గర్వంతో చెప్పాపెట్టకుండా
నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఎన్నడూ అనుకోలేదుగనుక…
నన్ను స్వీకరించు!
ఇంతకుముందుకంటే ఇప్పుడు
నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను.
తిరుగులేని నా ఆత్మని కూడా
దానితోపాటు నీకు సమర్పించకపోతే
ఈ శరీరపు కన్యాత్వమొక్కటీ
అపురూపమూ, అరుదూ కాదు కనుక
గాలిలా ఏ నియంత్రణలోనూ లేని
నా మనసునీ, నా కలల్నీ కూడా తీసుకో!
నిన్ను “స్వామీ” అని సంభోదిస్తాను,
ఎందుకంటే నువెన్నడూ అలా పిలవమనలేదు గనుక.
.
సారా టీజ్డేల్
ఆగష్టు 8, 1884 – జనవరి 29, 1933
అమెరికను కవయిత్రి.
.

వ్యాఖ్యానించండి