నేను పరదేశంలోనైనా
సంప్రదాయపు అలవాట్లూ, విధులూ నిర్వర్తిస్తాను.
నేను సంతోషంగా ఒక బుల్లి పిట్టను
వసంతోత్సవాల్లో స్వేచ్ఛగా విహరించమని వదుల్తాను.
ఇప్పుడు నాకు ఎంతో ఊరటగా ఉంది. అందుకు
సర్వశక్తిమయుడైనదేముడికి ఎంతైనా ఋణపడి ఉన్నాను.
అతని సృష్టిలో కనీసం ఒక జీవికైనా
నేను స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలిగేను.
.
అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్
6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837
రష్యను కవి.
.

- Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg
వ్యాఖ్యానించండి