నీ నిర్మలమైన హృదయమందిరానికీ
ప్రశాంతమైన మనసుకీ దూరంగా,
నిర్దాక్షిణ్యంగా వెళుతునానని
ప్రేయసీ, నన్ను నిందించకు.
నిజమే! మరొక స్త్రీని కాంక్షిస్తూ పరిగెడుతున్నాను
రణరంగంలో నాకు కనిపించే మొదటి శత్రువు వెనక,
కరవాలాన్నీ, గుర్రాన్నీ, కవచాన్నీ
ఎంతో విశ్వాసంతో గుండెలకి హత్తుకుంటాను.
నా ఈ చపలత్వం ఎలాంటిదంటే
అది నువ్వు కూడా హర్షిస్తావు; నిజానికి, ప్రేయసీ!
నా ఆత్మగౌరవాన్ని ఇంతగా ప్రేమించి ఉండకపోతే
నిన్ను అంతగా ప్రేమించి ఉండగలిగేవాడిని కాదేమో!
.
రిఛర్డ్ లవ్ లేస్
(1618–1657)
ఇంగ్లీషు కవి
.
Richard Lovelace
.
To Lucasta,
(Going to the Wars)
.
Tell me not, Sweet, I am unkind,
That from the nunnery
Of thy chaste breast and quiet mind
To war and arms I fly.
True, a new mistress now I chase,
The first foe in the field;
And with a stronger faith embrace
A sword, a horse, a shield.
వ్యాఖ్యానించండి