ఓ నా ఆత్మా! నువ్వు మళ్ళీ ప్రేమ మార్గంలో ఎందుకు తిరుగాడకూడదు?
నీ హృదయం ఒంటరితనాన్ని కోరుకుంటోంది; నీ జీవితం వృధాగా ముగుస్తుంది.
విధి అనే బ్యాటు నీ చేతిలోనే ఉంది; బంతినెందుకు కొట్టవు?
పైన ఎగురుతున్న అదృష్టపు పావురాన్ని ఎలాపట్టాలో నువ్వేనిర్ణయించుకోవాలి
నీ హృదయంలో ఎగసి ప్రవహించే ఈ ఎర్రని రక్తం
నీ ప్రియురాలిని గెలుస్తుంది; ఆమెని పోనివ్వకు.
ముళ్ళంటే ఉన్న భయం గులాబి దగ్గరకి వెళ్ళకుండా నిన్ను నిలువరిస్తే
లాభం లేదు. నువ్వు ఎన్నడూ దాని సుగంధాన్ని ఆశ్వాదించలేవు.
.
హఫీజ్
1325/26–1389/90
పెర్షియన్ మార్మిక కవి
హఫీజ్ అన్నపేరుతో ప్రసిద్ధుడైన ఖ్వాజా షంసుద్దీన్ ముహమ్మద్ హఫీజ్ షిరాజీ, పెర్షియన్ సాహిత్యంలో అగ్రగణ్యుడుగా గుర్తింపు పొండాడు. ఇప్పటికీ అతని కవితలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో ప్రతి ఇంటా లభ్యమవడమే గాక, అందరికీ కంఠస్థమై, అవి నానుడులుగా, జాతీయాలుగా చలామణీలో ఉన్నాయి. 14వశతాబ్ది తర్వాత వచ్చిన పెర్షియను సాహిత్యాన్ని అతని జీవితమూ, కవిత్వమూ ప్రభావితంచేసినట్టుగా ఇంకేదీ ప్రభావితం చెయ్యలేదని చెప్పవచ్చు.
వ్యాఖ్యానించండి