ఓహ్! ప్రకృతీ! నిన్ను ఇంతకంటే గాఢంగా హత్తుకోలేను!
నీ తెమ్మెరలేమిటి! విశాలమైన ఆకాశాలేమిటి!
పడిలెస్తూ ఎగసిపడే నీ మంచుదొంతరలేమిటి!
నీ ఈ వనాలు, ఈ శరదూదయం, పెరిగి సడలే తీపు,
అన్నీ రంగులకోసం పోటీపడుతున్నాయి! ఆ సన్నని కొండవాలు,
చెట్ల గుబురుపై తొలగుతున్న చీకటీ మనసుదోచుకుంటున్నై.
ఓ విశ్వమా! ప్రకృతీ! నేనూ ఇంతకంటే దగ్గర రాలేని అసమర్థురాలిని!
ఇందులోని మహిమగురించి చాలా కాలంగా తెలుసు;
కానీ మరీ ఇంత అందంగా ఉంటుందని ఎన్నడూ తెలుసుకోలేకపోయాను;
ఇక్కడ ఎంత వివశంగా ఉందంటే
నా మనసు అన్ని దిక్కులా సాగిపోతోంది. హే భగవాన్!
నువ్వు ఈ ఏడు ఈ ప్రకృతిని మరీ అందంగా మలిచేవని అనుకుంటున్నాను;
నా ఆత్మ నాలోంచి లేచిపోడానికి సిద్ధంగా ఉంది,
స్వామీ! వేడుకుంటాను, ఒక్క పండుటాకునీ రాలనీకు; ఏ పికాన్నీ పాడనీకు!
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
(February 22, 1892 – October 19, 1950)
అమెరికను
ఈ కవిత చదువుతుంటే నాకు వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి ఆశాగానము గుర్తొస్తోంది. ప్రాభాతప్రకృతిని ఎంతో రమ్యంగా వర్ణిస్తుంది కవయిత్రి. చివరి మాటలు బహుజాగ్రత్తగా గమనించదగ్గవి. అప్పటికే మనసు వివశమై శరీరంలోంచి ఆత్మ లేచిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇక ఒక పిట్టపాటవిన్నా, పండుటాకు రాలడం చూసినా ఆత్మలేచిపోతుందని సూచన.
.
Edna St. Vincent Millay
Image Courtesy: http://upload.wikimedia.org
.
God’s World
.
O World, I cannot hold thee close enough!
Thy winds, thy wide grey skies!
Thy mists, that roll and rise!
Thy woods, this autumn day, that ache and sag
And all but cry with colour! That gaunt crag
To crush! To lift the lean of that black bluff!

వ్యాఖ్యానించండి