నేను ప్రారంభించిన ఈ ప్రయాణంలో నా దారికి
ఎదురుగా అనంతదూరంలో సూర్యకిరణాలుసోకిన కొండ చూస్తున్నాను.
ఒకోసారి మనం అందుకోలేనిది మనల్ని అందుకుంటుంది;
దానిలో ఒక అంతర్గత కాంతి ఉంటుంది…అంత దూరం నుండి కూడా,
మనం అక్కడకి చేరుకోలేకపోయినా, మనల్ని ఉత్తేజపరచి
మనం ఏమాత్రం గ్రహించలేకుండానే మనల్ని వేరే వ్యక్తులుగా
మార్చెస్తుంది; మన చెయ్యూపుతూ చేసిన సంజ్ఞకి ప్రతిగా
మరొక సంజ్ఞ మనల్ని ముందుకి పురికొల్పుతుంది…
మనం తెలుసుకోగలిగింది మాత్రం ముఖాన్ని చిరుగాలి తాకుతూ పోవడం.
.
రైనర్ మారియా రిల్కే
(4 December 1875 – 29 December 1926)
ఆస్ట్రియన్ కవి
.

వ్యాఖ్యానించండి