“నాకు ఏ పేరూ లేదు;
పుట్టి రెండురోజులయింది. అంతే!”
మరి నిన్ను ఏమని పిలవాలి?
“నేను ఆనందంగా ఉన్నాను.
ఆనందమే నా పేరు.”
నీజీవితం ఆనందమయమగు గాక!
నిజమైన ఆనందం!
రెండురోజుల వయసుగల శైశవానందం.
మధురానందం అని పిలుస్తాను నిన్ను.
నువ్వు అలా నవ్వితే చాలు
నేను ఆనందంతో గీతాలాలపిస్తాను.
నీ జీవితం ఆనందమయమగు గాక!
.
విలియం బ్లేక్
(28 November 1757 – 12 August 1827)
ఇంగ్లీషు కవి
.

వ్యాఖ్యానించండి