1
పలుచని మేలిముసుగులో దాగుని
క్రమంగా మతిస్థిమితం కొల్పోతూ,
సన్నగా, పాలిపోయి,తన మందిరంలోంచి
వణుకుతూ బయటకి నడిచి వస్తున్న
మృత్యుముఖంలో ఉన్న స్త్రీలా
చీకటి తూరుపు దిశను నిరాకారమైన
తెల్లని ముద్దలా చంద్రుడు ఉదయించేడు.
2
ఎందుకు నువ్వు అలా పాలిపోయావు,
అకాశాన్ని ఎక్కిన అలసటవల్లా,
భూమిపై తొంగి చూడడం వల్లా,
వేరే పుట్టుక పుట్టిన నక్షత్రాల మధ్య
తోడులేక తిరగడం వల్లా? దేని మీదా దృష్టిపెట్టలేని
సంతృప్తిలేని కళ్ళలా, ఎప్పుడూ మార్పుకి లోనవడం వల్లా?
.
షెల్లీ
(4 August 1792 – 8 July 1822)
ఇంగ్లీషు కవి.
.

- PB Shelly
Image Courtesy:
http://www.theguardian.com/books/2010/jan/28/percy-bysshe-shelley-christopher-hitchens
వ్యాఖ్యానించండి