“అప్పుడప్పుడు నేను చెమ్చా జార్చెస్తుంటాను,” అన్నాడు కుర్రాడు,
“ఓస్, అంతే కదా, నేను కూడ జార్చెస్తుంటాను,” అన్నాడు ముసలాయన.
కుర్రాడు గుసగుసగా, “అప్పుడప్పుడు పక్కతడిపేస్తుంటాను,” అన్నాడు.
దానికి నవ్వుతూ, ” ఓ అదా, అప్పుడప్పుడు నేనూ చేస్తుంటాను,” అన్నాడు.
“ఎందుకో, నాకు తరచు ఏడుపొస్తుంటుంది,” అన్నాడు కుర్రాడు.
ముసలాయన తల తాటిస్తూ, “నేనూ అంతే” అన్నాడు.
ఫిర్యాదుగా “నాకు అన్నిటికంటే బాధించే విషయమేమిటంటే,
పెద్దవాళ్ళు ఎప్పుడూ నన్ను పట్టించుకోరు,” అన్నాడు కుర్రాడు.

వ్యాఖ్యానించండి