నాకు ఏ శ్వేత సౌధాలూ అనుగ్రహించవద్దు
ఏ మౌక్తిక, స్వర్ణ ప్రదేశాలూ అక్కరలేదు;
నాకు ఒక నాలుగేళ్ల బిడ్దని ప్రసాదించు, చాలు,
ఆనందపు అవధులు చవిచూడడానికి.
నాకు ఏ గులాబివన్నె రెక్కలూ వద్దు
దొంతులు దొంతులు ధవళ వస్త్రాలూ వద్దు;
నాలుగు వత్సరాల బాలుడినివ్వు
అదే నాకు సర్వస్వం.
నాకు ఏ రత్నఖచిత స్వర్ణ కిరీటాలూ వద్దు
ఏ సంగీత సాధనాలూ, సాహిత్య పరికరాలూ వద్దు;
నా ఒడిలో ఒదిగిపోయే నాలుగేళ్ళ వయసుగల
లేత గోధుమరంగుజుత్తుగల బిడ్డని ఇవ్వు.
నాకు కెంపు రంగు బుగ్గలు గలిగి,
చలికాచుకుందికి నన్ను హత్తుకునే రెండు చేతుల్నివ్వు;
నాలుగేళ్ల వయసున్న ఆ సన్నిధిలో
స్వర్గం అతి చేరువగా ఉంటుంది.
ఓ ప్రభూ! నీ అంతరిక్షాలనుండి ఎలా ఇస్తావో
ఎత్తుకుందికి ఒక స్వర్గాన్ని అందివ్వు;
ఒకప్పుడు మేరీ అనుభవించిన స్వర్గం
కేవలం నాలుగేళ్ళ వయసుది.
.
కేథరీన్ టైనన్
Jan. 23, 1861 – April 2, 1931
ఐరిష్ కవయిత్రి
.
Katherine Tynan
Irish Poetess.
.
The Desire
.
Give me no mansions ivory white
nor places of pearl and gold;
Give me a child for all delight,
Just four years old.
Give me no wings of rosy shine
Nor snowy raiment, fold on fold;
Give me a little boy all mine,
Just four years old.
Give me no gold and starry crown
Nor harp, or palm branches unrolled;
Give me a nestling head of brown,
Just four years old.
Give me a cheek that’s like the peach
Two arms to clasp me from the cold;
And all my heaven’s within my reach,
Just four years old.
Dear God, You give me from Your skies,
A little paradise to hold,
As Mary once her Paradise,
Just four years old.
.
Katherine Tynan
Jan. 23, 1861 – April 2, 1931
Irish Poetess
Poem Courtesy:
https://archive.org/stream/homebookofversea00stev#page/254/mode/1up
వ్యాఖ్యానించండి