డేలియా దూరంగా ఉన్నప్పుడు,
గుదిబండ తగిలించినట్టు కాళ్ళీడ్చింది కాలం;
ఆమె వెంట ఉన్నప్పుడు పాటలోనూ వేదనలేదు
ఏ రోజూ విసుగు కలగలేదు.
ఓ అసూయాగ్రస్త కాలమా! నీ విధి తిరగరాయి;
నీ నడకని మరింత నెమ్మది చెయ్యి,
ఎంత కష్టపడాలో పడు, ఎంత దోచుకుంటావో దోచుకో
ఆమె పక్కన ఉన్నప్పుడు క్షణాలనన్నిటినీ.
.
రిఛర్డ్ జాగో
(1 October 1715 – 8 May 1781)
ఇంగ్లీషు కవి.
.

వ్యాఖ్యానించండి