ఒకప్పుడు ఎంతో అందంగా ఉండి
మిలమిలలతో మెరిసిన దాని అందం
మనకళ్ళముందునుండే మాయమైతే నేమి?
గరికలో మెరిసిన
ఆ పువ్వు సౌరభమూ, మెరుపులూ
ఆ క్షణాలూ ఇక తిరిగి రాకపోయినా
మనమేమీ బాధపడము. బదులుగా
అది విడిచివెళ్ళిన దానిలోనుండి ఏదోధైర్యాన్నీ
అనాదిగా మనసు స్పృశించే సానుభూతి పంచుకుంటాం…
మానవ హృదయంలో బాధలు చూస్తున్నపుడు
అసంకల్పితంగా చిప్పిలే ఆత్మీయ అనుభూతి అది
ఒక సారి పొందిన అనుభూతి శాశ్వతంగా ఉంటుంది;
అదే విశ్వాసం మృత్యువును చూస్తున్నపుడూ కలుగుతుంది.
కాలం మనకి క్రమంగా కలిగే తాత్త్విక వివేచన అది.
.
విలియం వర్డ్స్ వర్త్
(7 April 1770 – 23 April 1850)
ఇంగ్లీషు కవి.
.

వ్యాఖ్యానించండి