నావిక ప్రియునికి… అజ్ఞాత కవి

నేనెప్పుడూ నీకోసం తపించడమేగాని పిసరంతైనా దరిచేరలేనా?

నేను మొరపెట్టుకోవడమే గాని, నా మాట వినిపించుకోవడం ఉండదా?

అయ్యొ! కనీసం అలా కాదు, కాదులే అనైనా చెప్పు.  అలా ముంగిలా ఊరుకోకు.

నీ మగతనం ఉట్టిపడే గొంతుకతో చెప్పు : నేను వస్తున్నానని.

అప్పుడు నిన్ను చూడలేకపోయినా  నా మనసు ఊరటచెందుతుంది

నువ్వు వస్తావన్న నమ్మకంతో. నీ మాటే ప్రమాణం.  నువ్వు బ్రతికుంటే.

ఉధృతంగా ఎగసిపడే ఈ కెరటాలు నన్ను భయపెడుతున్నాయి

ఆలోచనలను ముందుకీ వెనక్కీ కుదిపి భయపెడుతూ.

.

అజ్ఞాత  కవి / కవయిత్రి

మనకి తెలియని ఒక ప్రపంచం ఉంది. 

తెలుగులో ఒక సామెత ఉంది. కాశీకి వెళ్ళిన వాడూ కాటికి వెళ్ళిన వాడూ ఒకటే అని. దానికి కారణం ఆ రోజుల్లో ప్రయాణంలో ఉన్న ఇబ్బందులూ, అందులో ఉన్న రిస్కూ.  నేలమీదే అలాటి పరిస్థితి ఉంటే, నీటిమీద చెప్పవలసిన పని లేదు. 17వ ఏట మార్కోపోలో, అతని తండ్రీ, బాబాయీ  ఇంటిదగ్గరబయలు దేరిన తర్వాత 24 సంవత్సరాలకి మళ్ళీ ఇల్లు చేరుకున్నారంటే (ఈ మధ్యకాలంలో మార్కోపోలో తల్లి మరణిస్తుంది), ఇంటిదగ్గర ఆడవాళ్ళు పడే మానసిక వేదన ఊహించుకోవలసినదే.  అది మన చేతన పరిథిలో లేని విషయం. 

 
ఈ కవిత అచ్చం మార్కోపోలో తల్లి లాంటి ఒక స్త్రీ సముద్రం మీద వెళ్ళిన తన ప్రియునికై తపిస్తూ తనగోడు లోలోపల వెళ్ళబోసుకోవడాన్ని సూచిస్తోంది.   బహుశా ఇది రాసినది ఒక స్త్రీ అయి ఉండొచ్చునని నా భావన.     

From : Tottel’s Miscellany , 1557

To a Sea-faring Lover… Anonymous.  
.

Shall I thus ever long, and be no whit the neare?

And shall I still complain to thee, the which me will not hear?

   Alas! say nay! say nay! and be no more so dumb,

But open thou thy manly mouth and say that thou wilt come:

 

   Whereby my heart may think, although I see not thee,

That thou wilt come—thy word so sware—if thou a live man be.

   The roaring hugy waves they threaten my poor ghost,

And toss thee up and down.

.

Anonymous

English Poet

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.