ఒకనాటి రాత్రి, పచ్చికబయలంతా స్వర్ణహరితమై ఉన్నపుడు
సుగంధం నిండిన వాతావరణంలో, చంద్రకాంతశిలలతోచేసిన
నిలువెత్తు కొత్త సమాధుల్లా వెన్నెల్లో చెట్లు కనిపిస్తున్నపుడు,
నైసర్గిక ప్రకృతి అంతా కీటకాల అరుపులతో ప్రతిధ్వనిస్తున్నపుడు,
నేను గడ్డిలో మేనువాల్చి, పైన పరుచుకున్న అనంతదూరాలను తలుచుకుంటూ
చివరకి నేనేమౌతాను… నన్ను నేనెక్కడ కనుక్కోగలనని ప్రశ్నించుకున్నాను…
నా ఉనికి నేను మరిచినప్పటికీ, ఒక క్షణంపాటు,
నక్షత్రాలుపొదిగిన సువిశాల ఆకాశం నాదేననిపించింది,
తొలిసారి వర్షాన్నీ, గాలిహోరునీ వింటున్నట్టు,
మొదటిసారిగా నా పేరు నేను వింటున్నట్టు
అది నా పేరు కాదన్నట్టూ, నిశ్శబ్దానికే చెందినట్టూ,
అక్కడినుండి వచ్చి తిరిగి అక్కడికే మరలిపోతున్నట్టు…
సన్నగా అనంతదూరాలనుండి నా పేరు నాకు వినిపించింది…
.
మార్క్ స్ట్రాండ్
(April 11, 1934 -)
కెనేడియన్ అమెరికను కవీ, అనువాదకుడూ, వ్యాసకర్తా.
.
Mark Strand
వ్యాఖ్యానించండి