ఓ వీనస్! పగలు గతించింది
మెత్తగా మౌనంగా రాలుతోంది మంచు
ఇప్పుడు ప్రతిపువ్వు మీదా కన్నీటిబొట్టే
స్వర్గం వేరెక్కడా లేదు, ఉంది నీ చెంతనే!
ఓ వీనస్! అందమైన సంధ్య మమ్మల్ని
నెమ్మదిగా, తెలియకుండా కమ్ముకుంటోంది
దివా రాత్రాల కలయిక వేళ
పసిపాప ఊపిరితీస్తున్నట్టు ఉంది.
ఓ వీనస్! మంచుకురిసిన నేలమీద
రాలిపడిన పువ్వు నిద్రిస్తోంది
మంచు సన్నని జల్లుగా కురుస్తుంటే
చుట్టూ ప్రకృతి శ్వాసిస్తున్నట్టు ఉంది.
ఓ వీనస్! వినీలాకాశంనుండి
మిణుకుమంటున్న నీ కాంతికిరణం
అలసిన బాటసారికి తోవచూపిస్తూ
నేలని మన్నించేలా చేస్తుంది.
.
జాన్ క్లేర్
13 జులై 1793 – 20 మే 1864
ఇంగ్లీషు కవి.
.

వ్యాఖ్యానించండి