యక్షిణుల కన్నా వేగంగా, మంత్రగత్తెలకన్నా వడిగా,
గుట్టలూ, ఇళ్ళూ, కంచెలూ, కందకాలూ;
యుద్ద్ధంలో సేనలు దాడి చేస్తున్నట్టు
పొలాల్లోంచి, గుర్రాలు, పశువుల మధ్యలోంచి;
కొండలూ, మైదానాల వింతలన్నీ
తరుముకొస్తున్న చిక్కని వర్షంలా పరిగెడుతునాయి;
రెప్పపాటులో రంగులేసిన స్టేషన్లు
మళ్ళీ కనిపించకుండా మాయమౌతునాయి.
అక్కడో కుర్రాడు చూడానికి కష్టపడి ఎగబాకుతున్నాడు
ముళ్ళకంపల్ని తనొక్కడూ పక్కకి తొలగించుకుంటూ;
ఇక్కడొ దేశదిమ్మరి నిలబడి తేరిపారి చూస్తున్నాడు;
అడివిపూలని మాలలల్లడానికి పచ్చని తీగ అదిగో!
రోడ్డు మీద పరిగెత్తే గూడుబండి ఇదిగో
మనుషులతో బరువులతో తడబడుతూ కదుల్తూ
ఇక్కడిమిల్లూ, అక్కడి నదీ క్షణకాలం కనిపించి
శాశ్వతంగా కనుమరుగైపోతునాయి
.
రాబర్ట్ లూయీ స్టీవెన్సన్
(13 నవంబరు 1850 – 3 డిశంబరు 1894)
స్కాటిష్ కవి, నవలాకారుడూ, వ్యాసకర్త.
.

వ్యాఖ్యానించండి