నువ్వు కలిసే ప్రతిమనిషిపై అనుకంప చూపించు…
వాళ్ళు అక్కరలేదన్నప్పటికీ.
మనకి అసభ్య నడతగా, చిటపటలాడే స్వభావంగా,
నిరాశావాదంగా కనిపించే ప్రవర్తన
మన చెవులు వినని, కనులు చూడని ఎన్నో వాటికి సంకేతం.
అక్కడ…
“దేహమూ ఆత్మా సహజీవనంచేసే చోట”
ఎన్ని అగోచర అంతర్యుద్ధాలు జరుగుతున్నాయో నీకు తెలియదు.
.
మిల్లర్ విలియమ్స్
(born April 8, 1930)
Note:
దేహమూ ఆత్మా సహజీవనంచేసే చోట (“Spirit meets the Bone”):
దేహము పదార్థానికి ఉదాహరణ అయితే, ఆత్మ అభౌతిక విషయానికి చిహ్నం.
19వ శతాబ్దపు ప్రముఖ తత్త్వవేత్త హెగెల్ సిద్ధాంతం ప్రకారం మనసు లేదా ఆత్మ
(Mind or Spirit) ఎప్పుడూ రెండు పరస్పర విరుద్ధ స్వభావాలతో
ప్రకటితమవుతుంటుందనీ, ఏ ఒక్కటీ రెండవదాన్ని హరించడం గాని, రెండవదానిగా
మారడం గని కాకుండా, ఒకటిగా సహజీవనం చేస్తాయని చెప్పేడు. ఉదాహరణగా
దైవత్వం భౌతిక ప్రకృతికి అంతర్భాగంగా భావించే భావనా (Immanence),
దైవత్వాన్ని భౌతిక ప్రకృతికి అతీతంగా భావించే భావనా (Transcendence)
చూపించేడు.
.
The Ways We Touch
.
Have compassion for everyone you meet,
even if they don’t want it.
What appears bad manners, an ill temper or cynicism
is always a sign of things no ears have heard,
no eyes have seen.
You do not know what wars are going on down there
where the “spirit meets the bone”.
.
వ్యాఖ్యానించండి