వెన్నెలలనద్దుకున్న తమాల వృక్షాలు అర్థరాత్రి
అతని సమాధిమీద వింత వింత నీడలు అల్లుతున్నప్పుడు,
అప్పుడే విడిచిన నులివెచ్చని వానచినుకులలో తడిసిన
జాజిపూలగుత్తులమీదనుండి పరిగెత్తే ప్రాతసమీరంలా
అతని అసంపూర్ణ గీతాన్ని దీనంగా ఆలపిస్తోంది గాలి;
అతని శిరసు మీదకి వంగి చంద్రకాంత రోదిస్తోంది,
కెరటాలన్నీ నిశ్చలమై నిలిచిపోగా, పోటెత్తుతున్న
సముద్రాలు చీకటిలో మునిగి ప్రశాంతమై పోయేయి;
గాఢనిద్రలో అప్పుడపుడు మూలిగుతూ, తనను ఆవరించిన
నీరవ మేదినిని ఆశ్చర్య పరిచే అతనిపై ఎంత జాలంటే
మైదానాలనీ, కెరటాలనీ మేల్కొలపగలిగినవారికి
అతన్ని నిద్రనుండి మేల్కొలపడానికి మనసు రావడం లేదు.
ఇప్పటికీ అతను విషణ్ణవదనయైన పెర్సిఫోన్ ని వివశను చేస్తునాడు
కాంతిమయమైన నేలా, నీటిపుట్టల ఆశల దృశ్యాలతో .
.
సారా టీజ్డేల్
August 8, 1884 – January 29, 1933
అమెరికను కవయిత్రి.
.

వ్యాఖ్యానించండి