జీవితం ఒక పరిహాసం, అన్ని వస్తువులూ అదే ఋజువుచేస్తాయి.
ఒకప్పుడు నేనూ అలాగే అనుకునే వాడిని; ఇప్పుడు నాకు తెలుసు.
.
జాన్ గే
(30 June 1685 – 4 December 1732)
ఇంగ్లీషు కవీ, నాటక కర్తా.
ఈ కవితలో సౌందర్యం “Jest” అన్న మాటని సునిశితంగా వినియోగించిన తీరు. మొదటి పాదంలో జీవితం పరిహాసం అన్నప్పుడు ప్రకృతిలోని వస్తువులని పరికిస్తూ ఆశగా … కావాలని కోరుకునే ఆనందం (Wishfulness) అన్న అర్థం సూచిస్తే, రెండో పాదంలో “ఇప్పుడు నేను తెలుసుకున్నాను అన్నచోట”… జీవితం నిజంగా ఎంత ఆనందకరమో! (Regretfulness for losing something you have realized to be true) అని రుచిచూసిన తర్వాత కలిగే భావన సూచిస్తుంది. మళ్ళీ అది అనుభవంలోకి వస్తుందా? అని ప్రశ్నిస్తే అది అతి తక్కువ సంభవత (Probability) మీద ఆధారపడి ఉంది.
జాన్ గే పేరు చెప్పగానే చాలా మందికి తెలియకపోవచ్చు గాని, గురజాడ అప్పారావుగారు కన్యాశుల్కం నాటకంలో గిరీశం అన్న
“It’s Woman that seduce all mankind; “
“Can Love be control’d by Advice?
Will Cupid our Mothers obey?”
మాటలు తప్పకుండా గుర్తుండే ఉంటాయి.
ఇవి జాన్ గే Beggar’s Opera అన్న నాటకం లోనివి. దీన్ని బట్టి ఆ రోజుల్లో Satirical Drama ఎంతగా ప్రజా బాహుళ్యంలో, కనీసం ఇంగ్లీషు కొత్తగా నేర్చుకుంటున్న మొదటి తరాల్లో, ప్రచారంలో ఉండేదో గ్రహించవచ్చు. బహుశా అప్పారావుగారు, కన్యాశుల్కాన్ని ఆ తీరులో రూపుదిద్దాలనుకుని కూడా ఉండొచ్చు.
.

.
My Own Epitaph
Life is a jest, and all things show it.
I thought so once, but now I know it.
.
John Gay
(30 June 1685 – 4 December 1732)
English Poet and Dramatist.
Poem Courtesy:
The Book of Restoration Verse. 1910
Ed. William Stanley Braithwaite
http://www.bartleby.com/332/428.html
My
వ్యాఖ్యానించండి