ముందు ఆమె అందంగా ఉండాలి
ఒక ఏకాంతపు మధ్యాహ్న వేళ
నా కవిత్వ పుస్తకం దగ్గరకి నడవాలి,
తలస్నానంచేసి వచ్చిన ఆమె మెడదగ్గర
జడ ఇంకా తడిగా ఉండాలి. ఆమె రెయిన్ కోటు తొడుక్కోవాలి
అది కూడా బాగా పాతది, డబ్బుల్లేక
ఎన్నాళ్ళబట్టో ఉతకక మురికిగా ఉండాలి.
ఆమె కళ్ళజోడు తీసి, పుస్తకాల షాపులో
నా కవిత్వ పుస్తకం పేజీలు తిరగేసి, తిరిగి దాన్ని
పుస్తకాల షెల్ఫ్ లో ఉంచెస్తుంది. ఆమె తనలో ఇలా
అనుకుంటుంది, ” అన్నిడబ్బులుపెడితే
నా రెయిన్ కోటే లాండ్రీకి ఇచ్చుకోవచ్చు.” ఆమె ఇస్తుంది కూడా.
.
టెడ్ కూజర్,
25 ఏప్రిల్, 1939
అమెరికను కవి.
.

- Ted Kooser
వ్యాఖ్యానించండి