నిజానికి నాదగ్గర ఒకటేమిటి
ఒకటికంటే ఎక్కువే ఉన్నాయి కవితలు
వాటితో పాటే ఇదికూడా మీకు చెబుతాను
ఆ పీడకల ఉందే, అదే,
అల్జీరియా యుద్ధానికి వ్యతిరేకంగా
ఒకటి రాసేను , మరొకటి
కొరియా యుద్ధానికి వ్యతిరేకంగా
మరొకటి నేను
పాల్గొన్నదానికి వ్యతిరేకంగా
నాకు గుర్తులేదు
ఈ మూడూ కాకుండా
ఇంకెన్నిన్నున్నాయో
నేను కుర్రాడిగా ఉన్నప్పుడు
అబిసీనియా, స్పెయిన్
హార్లాన్ కౌంటీలు…
అందులో
ఒక్కరంటే ఒక్కరు
బతికిబట్టకట్టలేదు…
గొంతుకలు బద్దలై
ఆడ, మగ, పిల్లలు
అన్నతేడా లేకుండా ఒక్కరు కూడా
మృత్యువు అలా
పక్కకికూడా తిరగకుండా
తనమానాన్న తను…
అప్పుడప్పుడు
నేను గమనిస్తున్నానని రూఢిచేసుకుందికి మాత్రం
దొంగ నవ్వు నవ్వుతూ
.
హీడెన్ కరూత్
August 3, 1921 – September 29, 2008
అమెరికను కవి
.

వ్యాఖ్యానించండి