శుక్రవారం … ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి

ప్రశాంతమైన శుక్రవారం

బావురుమంటున్న శుక్రవారం

పాత ఇరుకుసందుల్లా భయపెట్టే శుక్రవారం

బద్ధకంగా అనారోగ్యపు ఆలోచనల శుక్రవారం

వంకరటింకరగా విస్తరించిన దుర్గంధపు శుక్రవారం

ఎదురుచూడడానికి ఏదీలేని శుక్రవారం

అణిగి ఉండవలసిన శుక్రవారం…

శూన్యమైన ఇల్లు

ఒంటరిగా దివుదివుమంటూన్న ఇల్లు

యువత తిరుగుబాటుకివ్యతిరేకంగా మూసిన ఇల్లు

వెలుగుకోసం కలలుగనే చిమ్మచీకటి ఇల్లు

ఒంటరితనం, శకునాలూ, అస్థిరతా కూడిన ఇల్లు

కర్టెన్లూ, పుస్తకాలూ, బీరువాలూ, చిత్రపటాలూ ఉన్న ఇల్లు

ఆహ్! నా జీవితం నిశ్శబ్దంగా, నిర్మలంగా ఎలా సాగిపోయిందో

గంభీరంగా ప్రవహిస్తున్న సెలయేటిలా…

ఆ సందడిలేని, బావురుమటున్న శుక్రవారాలలోనూ,

ఏ ఉల్లాసమూ లేని శూన్యమైన ఇంటిలోనూ

ఆహ్! నా జీవితం నిశ్శబ్దంగా, నిర్మలంగా ఎలా సాగిపోయిందో!

.

ఫరూవే  ఫరుక్జాద్

January 5, 1935 — February 13, 1967

పెర్షియన్ కవయిత్రి

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

ఫరూవే  ఫరుక్జాద్

20వ శతాబ్దపు ఇరానియన్ కవయిత్రులలో అతిప్రతిభావంతమైన, శక్తివంతమైన గొంతుకలలో ఫరూవే ఫరక్జాద్ ఒకరు. విడాకులు తీసుకున్న స్త్రీగా, ఛాందస భావాలను తొసిరాజంటూ శక్తివంతంగా చెప్పిన ఆమె కవిత్వం అనేక వ్యతిరేకతలని ఎదుర్కొని బహిరంగంగా గర్హించబడింది కూడ.

కవులు ఆమె జీవితం నుండి నేర్చుకోవలసినదీ, అనుకరించవలసినదీ ఎంతైనా ఉంది. కవిత్వాన్ని జీవితంలో ఒక భాగంగా చూసిన ఆమె జీవితంలో రెండు చక్కని ఉదాహరణలు: ఒకటి కుష్టువ్యాధితో బాధపడుతున్న ఇరానియన్లపై ఆమె 1962 లో  The House is Black అన్న పేరుతో తీసిన డాక్యుమెంటరీ 12 రోజుల చిత్రీకరణలో ఇద్దరు కుష్టురోగుల పిల్లడికి చేరువై అతణ్ణి దత్తత తీసుకోవడం; రెండు:  పిల్లల స్కూలుబస్సును ఢీకొనకుండా ఉండేందుకు తనజీపును పక్కకితప్పిస్తూ రాతిగోడను గుద్దుకుని ప్రాణాలు విడవడం.

The Captive (1955), The Wall, The Rebellion,  Another Birth (1963) అన్న కవితా సంకలనాలు వెలువరించింది. ఆమె మరణానంతరం ప్రచురితమైన Let us believe in the beginning of the cold season  పెర్షియన్ భాషలో అత్యుత్తమ ఆధునిక కవితగా కొందరు కొనియాడేరు. ఆమె కవిత్వం ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, తుర్కిష్, మొదలైన అనేక భాషలలోకి అనువదించబడింది.

Friday

Quiet Friday
deserted Friday
Friday saddening like old alleys
Friday of lazy ailing thoughts
Friday of noisome sinuous stretches
Friday of no anticipation
Friday of submission.

Empty house
lonesome house
house locked against the onslaught of youth
house of darkness and fantasies of the sun
house of loneliness, augury and indecision
house of curtains, books, cupboards, picture.

Ah, how my life flowed silent and serene
like a deep-running stream
through the heart of such silent, deserted Fridays
through the heart of such empty cheerless houses
ah, how my life flowed silent and serene.

.

Forugh Farrokhzad

January 5, 1935 — February 13, 1967

Persian Poetess

Translated by Ahmad Karimi-Hakkak. Remembering the Flight: A Parallel Text in English and Persian