ఒకరోజు ఆమె పేరు ఇసుకలో రాసాను సముద్రతీరాన,
కాని అలలు వచ్చి దాన్ని ఊడ్చుకుపోయాయి,
మళ్ళీ మరో సారి చేత్తో రాసేను
మళ్ళీ కెరటం వచ్చి నా శ్రమని హరించింది.
“ప్రయోజనం లేదు, ప్రియా” అంది ఆమె, “నువ్వు అనవసరంగా
శ్రమపడుతున్నావు, నశ్వరమైన దాన్ని శాశ్వతం చెయ్యడానికి
నా మట్టుకు నాకు ఇలాగే నశించిపోవడం ఇష్టం.
దానితో పాటే, నా పేరూ అలాగే చెరిగిపోవాలి.
“వీల్లేదు,” అన్నాను నేను, “విలువలేనివి
మట్టిలో కలిసేమార్గాలు ఎన్నుకోనీ, నీ కీర్తి శాశ్వతం.
నా కవిత నీ గుణాలని అజరామరం చేస్తుంది,
నీ పేరు స్వర్గంలో గొప్పగా ఉల్లేఖించబడుతుంది.
మృత్యువు ఏదోనాడు ప్రపంచాన్ని లోబరచుకుంటుంది
కాని మన ప్రేమ నిలుస్తుంది, మరుజన్మలో మరింతకొత్తగా.”
.
ఎడ్మండ్ స్పెన్సర్
1552- 13 జనవరి, 1599
ఇంగ్లీషు కవి
.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Edmund_Spenser_oil_painting.JPG
వ్యాఖ్యానించండి