నేను మట్టిలో తిరిగి కలిసిపోయేక
సంతోషంతో అతిశయించిన ఈ శరీరం
ఒకప్పుడు తను విర్రవీగిన
ఎర్ర, తెల్లకణాలను వదుల్చుకున్నాక…
నా మీద నుండి పురుషులు నడిచిపోతూ
తెచ్చిపెట్టుకున్న లేశమాత్రపు జాలితో మాటాడితే
నా మట్టి తిరిగి గొంతు తెచ్చుకుని
వాళ్ళకి గట్టిగా ఇలా ఎదురుచెబుతుంది:
“చాలు, ఆపండి! నేను సంతృప్తిగా ఉన్నాను.
మీ జాలి నాకక్కరలేదు! వెనక్కి తీసుకొండి.
సంతోషమన్నది నాలో ఒక జ్వాల
ఎంత నిలకడ అంటే అంత సులువుగా ఆరదు;
సులువుగా ఒదిగే రెల్లు అంత చురుకైనది
తనను అల్లల్లాడించే సుడిగాలిని సైతం ప్రేమించగలదు…
మీరు ఉత్సాహంతో ఉన్నప్పుడు పొందిన ఆనందంకంటే
ఎక్కువ ఆనందాన్ని నేను దుఃఖంలో పొందగలిగాను.”
.
సారా టీజ్డేల్
ఆగస్ట్ 8, 1884 – జనవరి 29, 1933
అమెరికను
.

వ్యాఖ్యానించండి