కొత్తగా కుసుమించిన పుష్పపు సొబగులు
దివ్యంగా ఉండొచ్చు; నాకు మాత్రం చివరి సుమమే ఇష్టం.
నా కలలూ. ఆశలూ, కోరికలన్నిటిలోనూ ఎప్పుడూ
నా మనసుకి పునస్సమాగమమే బాగుంటుంది
మేమిద్దరం కలిసి గడిపిన క్షణాలకంటే,
వీడ్కోలుపలుకుతూ గడిపిన ఘడియలే స్ఫూర్తినిస్తాయి.
.
అలెగ్జాండర్ పుష్కిన్
6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837
రష్యను మహాకవి
.

- Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg
వ్యాఖ్యానించండి