అనువాదలహరి

బతికున్నవాడికో పువ్వు… నిక్సన్ వాటర్ మన్, అమెరికను

శవాలపై విలువైన పూలమాలలుంచే కంటే

బ్రతికున్నవాడికి ఒక గులాబి ఇవ్వడం మెరుగు;

అంతులేని ప్రేమ కోశాన్ని నింపే ప్రక్రియలో

బ్రతికున్నవారికి ఇచ్చే ఒక గులాబీ అమూల్యమైనది,

అలమటిస్తున్న ఆత్మ శలవుతీసుకోకమునుపే

కోరకుండా ఉదారంగా ఇవ్వగలిగితే…

బ్రతికున్న వాడికి ఇచ్చే ఒక గులాబి పువ్వు

శవాలమీది విలువైన దండల కంటే మిన్న

.

నిక్సన్ వాటర్ మన్

12 నవంబరు, 1859 – 1 సెప్టెంబరు 1944)

అమెరికను

.

A Rose to the Living

 .

A Rose to the living is more   

Than sumptuous wreaths to the dead;       

In filling love’s infinite store, 

A rose to the living is more,   

If graciously given before               

The hungering spirit is fled,—

A rose to the living is more    

Than sumptuous wreaths to the dead.       

.

Nixon Waterman

(12 November 1859 – 1 September 1944)

American

Poem Courtesy:

Anthology of Massachusetts Poets.  1922.

Ed. William Stanley Braithwaite, (1878–1962).

(http://www.bartleby.com/272/85.html)

%d bloggers like this: