ఎక్కడో, దూరంగా
పెనవేసుకున్న పనలతో, పండిన గోధుమ చేలలో
ఒక చిన్న అడివికోడిపిల్ల ఏడుస్తోంది
తనవాళ్ళందరినుండి తప్పిపోయి, వేడుకుంటూ, వెక్కివెక్కి.
ఇంతలో, మట్టికొట్టుకుని, రెక్కలు చెదిరి
దుమ్ముకొట్టుకున్న కళ్ళతో
సమాధానం చెప్పలేని తల్లి కోడి
వేటగాడి కాళ్ళదగ్గర రక్తమోడుతూ, కదల్లేక పడి ఉంది.
.
హేమ్లిన్ గార్లాండ్
(September 14, 1860 – March 4, 1940)
అమెరికను కవి.
.

.
Sport
.
వ్యాఖ్యానించండి