ఎంచుకో… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను

అటు గట్టిగా బిగించబడి, సిద్ధంగా పైకి లేపిన ఒక పిడికిలి,

ఇటు దేహీ అని యాచిస్తూ నీ ముందుకి చాచబడి ఎదురుచూస్తున్న  చేయి…

ఏదో ఒకటి ఎంచుకో

ఎందుకంటే ఏదో ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటుంది.

.

కార్ల్ సాండ్బర్గ్

(January 6, 1878 – July 22, 1967)

అమెరికను.

ఇంత చిన్న కాన్వాసులో  అద్భుతమైన భావాన్ని చెబుతున్నాడు కవి.  మనకి జీవితంలో ఎంపిక చేసుకుందికి  రెండే  ఉన్నాయి… మనకి సమాజం పట్ల అసహనం ఉంటే, దాన్ని మార్చడానికి పిడికిలి బిగించి సాగిపోవడం; లేదా, సమాజంచే మోసపోయి  బ్రతుకే యాచనగా మారిన వాళ్ళకి మనవంతు సహాయం చెయ్యడం.

.

Carl Sandburg, American poet
Carl Sandburg, American poet (Photo credit: Wikipedia)

.

Choose

.

The single clenched fist lifted and ready,
Or the open asking hand held-out and waiting.
               Choose:
For we meet by one or the other.

.

Carl Sandburg

(January 6, 1878 – July 22, 1967)

American

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.