గదినిండా గడ్డి బలిసిపోయింది.
ఫర్నిచరు అంతా చుట్టుముట్టేసింది.
అది వంటగదిలోంచి సాగి స్వింగ్ డోరు దాటుకుని వంటగదిలోకి పాకిరింది.
అది మైళ్ళకు మైళ్ళూ గదిగోడలలోకి విస్తరించింది.
అందులో పడవేసిన వస్తువులో, కోరి దాచుకున్నవో గాని,
ఈ గడ్డిలో అద్భుతమైన భాండాగారం ఉంది: ఒకప్పుడు పేనాకత్తిగా వాడిన
తుప్పుపట్టిన ఇనప పుల్లా, ఒక సమాధి ఫలకమూ, …
అన్నీ గడ్డిలో దాగున్నాయి కిటికీ అంచులకు పెరిగిన గడ్డిలో.
గడ్డికింద ఉన్న గదిలో, ఒక ముసలతను తూగుకుర్చీలో కూర్చున్నాడు,
ముందుకీ వెనక్కీ ఊగుతూ; అతని చేతుల్లో
తనుపసివాడిగా ఉన్నప్పటి తన శరీరమే ఉంది;
చీకట్లో, గడ్డిక్రింద, ఇటూ అటూ ఊగుతూనే ఉన్నాడు.
.
రసెల్ ఎడ్సన్
(1935 – )
అమెరికను.
.

Image Courtesy: http://www.aprweb.org/files/author_images/edson.jpg
వ్యాఖ్యానించండి