(ఈ రోజు మా అమ్మ పవిత్ర దినం. ఆ స్మృతిలో తల్లులందరికీ కృతజ్ఞతలతో)
Note: కొన్ని అనివార్యకారణాలవల్ల ఇక్కడ ఈ రోజు ముందు ఉంచిన పోస్టు తొలగించి ఈ కొత్తది ఉంచడమైనది.
.
ఊహకందని ఎత్తులోని కొండమీద నన్ను ఉరితీసినా
నను గన్న తల్లీ! ఓ నన్ను గన్న తల్లీ!
ఎవరి ప్రేమ నన్ను వెంబడిస్తుందో తెలుసు,
నను గన్న తల్లీ! ఓ నను గన్న తల్లీ!
లోతైన సముద్రంలో నన్ను ముంచి వేసినా,
నను గన్న తల్లీ! ఓ ననుగన్న తల్లీ!
ఎవరి కన్నీళ్ళు నను చేరుకుంటాయో తెలుసును,
నను గన్న తల్లీ! ఓ ననుగన్న తల్లీ!
నా శరీరమూ ఆత్మా నరకంలో కొట్టుకుంటున్నా
ఎవరి ప్రార్థనలు నన్ను రక్షిస్తాయో నాకు తెలుసు
నను గన్న తల్లీ! ఓ నను గన్న తల్లీ!
(1891 )
.
(The Light That Failed అన్న నవల అంకితం సందర్భంగా వ్రాసిన కవిత)
రుడ్యార్డ్ కిప్లింగ్
ఇంగ్లీషు కవీ, నవలాకారుడూ, కథకుడు.
.

వ్యాఖ్యానించండి