
ప్రకృతి అంటే మనం దర్శించేది,
ఈ పర్వతాలూ, ఈ మధ్యాహ్నాలూ,
ఆ ఉడతా, ఈ గ్రహణాలూ, ఆ తుమ్మెదా,
కాదు కాదు…. ప్రకృతి అంటే స్వర్గమే.
ప్రకృతి అంటే మనం వినేది,
ఆ బాబొలింక్* ఈ సంద్రఘోష,
ఆ ఉరుములూ, ఆ కీచురాయీ,
ఓహ్, కాదు… ప్రకృతి అంటే స్వరసాయుజ్యమే.
ప్రకృతి అంటే మనకి పరిచయమున్నదే
కానీ దాన్ని వివరించగల కళ మనకి లేదు
దాని నిరాడంబరతముందు
మన జ్ఞానమంతా నిర్వీర్యమే.
.
ఎమిలీ డికిన్సన్
(December 10, 1830 – May 15, 1886)
అమెరికను కవయిత్రి
Notes:
* బాబొలింక్ అన్నది చక్కగా పాడే ఒక ఉత్తర అమెరికను పక్షి (Dolichonyx oryzivorus). శీతకాలంలో దక్షిణానికి పోతుంది.
.

వ్యాఖ్యానించండి