రాత్రి ఒంటిగంట దాటింది. నువ్వు ఈపాటికి నిద్రకి ఉపక్రమించి ఉంటావు.
పాలపుంత రాత్రి పొడవునా వెండివెలుగులు విరజిమ్ముతూనే ఉంది.
నా కేమీ తొందరలేదు; మెరుపుల తంతివార్తలు పంపి
నిన్ను మేలుకొలిపి ఇబ్బందిపెట్టడానికి తగిన కారణం కనిపించదు.
ఇంతకీ, అదెవరో చెప్పినట్టు, ఆ విషయం ముగిసిపోయింది.
నిత్యనైమిత్తికాల రాపిడికి ప్రేమ పడవ పగిలిపోయింది.
ఇప్పుడు నీకూ నాకూ చెల్లు. ఇంకెందుకు వివాదం
దుఃఖాలూ, విచారాలూ, గాయాలూ లెక్కలేసుకోవడం?
చూడు, ప్రపంచం మీద ఎంత ప్రశాంతత పరుచుకుంటోందో.
చీకటి ఆకాశాన్ని చుట్టజుట్టి నక్షత్రాలకి కప్పం కడుతోంది.
ఇటువంటి ఘడియల్లో, మనిషి కాలంతో, చరిత్రతో,
సమస్త సృష్టితో సంభాషించడానికి ఉద్యుక్తుడౌతాడు.
.
వ్లాడిమిర్ మయకోవ్ స్కీ
(July 19, 1893 – April 14, 1930)
రష్యన్ కవి
.

వ్యాఖ్యానించండి