మనిద్దరం కలిసి ఉండలేం.
మనిద్దరిదీ చెరోదారి.
నువ్వు కసాయి బంటువి,
నేను ఏ దిక్కులేని అనాధని.
నువ్వు పళ్ళెంలో భోంచేస్తావు
నేను బితుకు బితుకు మంటూ బతుకుతాను.
నువ్వు ప్రేమ గురించి కలలు కంటుంటావు,
నేను రాత్రి భోజనం ఎలాగా అని ఆలోచిస్తుంటాను.
కానీ, మిత్రమా,
నీదీ అంత సుఖమైన జీవితం కాదులే.
నిజం. ప్రతి సారీ,
ప్రతి దిక్కుమాలిన రోజూ
తోక ఊపుకుంటూ నిలబడ్డం
అంత సులువేమీ కాదు.
.
ఓర్హాన్ వేలీ కణిక్
13 April 1914 – 14 November 1950
టర్కీ కవి
.
Poem With A Tail
.
We can’t be seen together.
Our paths are separate.
You belong to the butcher.
I’m just an alley cat.
You eat off a metal plate,
I from the lion’s mouth.
You dream of love.
I dream of dinner.
But your path isn’t easy either, pal.
No, it’s not easy
to wag a tail
all and every
godforsaken day.
.
Orhan Veli
(13 April 1914 – 14 November 1950)
Turkish Poet.
Poem With A Tail

వ్యాఖ్యానించండి