నువ్వు దేన్ని బాగా ఇష్టపడతావో
అదే నీతో నిలిచేది, మిగతాది అంతా రద్దే;
నువ్వు దేన్ని గాఢంగా ప్రేమిస్తావో
దాన్ని నీనుండి ఎవరూ లాక్కో లేరు;
నువ్వు దేన్ని అమితంగా కాంక్షిస్తావో,
అదే నీ నిజమైన వారసత్వం.
ఈ ప్రపంచం ఎవరిది? నాదా?
వాళ్ళదా? ఎవరిదీ కాదా?
మొదటగా తెలిసేది దృశ్యమాన జగత్తు,
తర్వాతే అనుభూతిమయ నందనవనాలు
అవెంత నరకంలో ఉన్నా.
నువ్వు దేన్ని అమితంగా కాంక్షిస్తావో,
అదే నీ నిజమైన వారసత్వం.
నువ్వు దేన్ని గాఢంగా ప్రేమిస్తావో
దాన్ని నీ నుండి ఎవరూ లాక్కో లేరు;
.
ఎజ్రా పౌండ్
30 October 1885 – 1 November 1972
అమెరికను
.

వ్యాఖ్యానించండి