డేవీస్ నీకు గుర్తున్నాడా?
పాపం, పోయాడు, తెలుసా?
వెల్ష్ కొండల్లో, పేదరైతు రాళ్లుతేరిన
తనపొలంలోనే చచ్చిపోయినట్టు
జీవితం మీద ఆశలు వదిలేసుకుని.
నాకు ఇంకా గుర్తే … పెంకులచూరుకింద అతని గదీ,
అతను పడుక్కునే విశాలమైన పక్కా
దానిమీద వెలిసిపోయిన దుప్పటీను…
ఒంటరిగా, మార్చినెల మధ్య ఎండల్లో
ఈనలేక బాధపడుతున్న ఆడగొర్రెలా ;
అంతే కాదు, ఇంట్లో చిక్కుకున్న వడిగాలి
తెరలన్నిటినీ చించుకుని బయటకి పోవడమూ,
ఎండ నేలమీద విన్యాసాలు చెయ్యడమూ గుర్తే.
చుట్టుపక్కలవాళ్ళు గట్టిగా అడుగులేసి నడుస్తుంటే
అతని తల అదరకుండా ఉండడానికి పాపం
తలక్రిందకి ఒక దుప్పటీ అయినా …
కనీసం చాప అయినా లేకుండా బోసిగా ఆ బల్లచెక్కమీద;
వచ్చినవాళ్ళు ఒకసారి తొంగి చూసి, అర్థంలేని ఓదార్పు మాటలు
ఏవో వల్లిస్తూ, చెమ్మకుండి చివికిపోయిన గది గోడల్లాగే
చావుకంపుకొడుతున్న అతనినుండి దూరంగా
నిర్దాక్షిణ్యంగా వెనక్కి మరలడమూ గుర్తే.
.
రొనాల్డ్ స్టూవర్ట్ థామస్
(29 March 1913 – 25 September 2000
వెల్ష్ కవి
.

వ్యాఖ్యానించండి