రేయికి ఎన్నో వేల కన్నులున్నాయి
పగటికి మాత్రం ఒక్కటే.
అందుకే సూర్యుడు కనుమరుగవడంతోనే
ఈ ప్రపంచం మీది వెలుగంతా నశిస్తుంది.
మనసుకి వెయ్యి కన్నులున్నాయి
హృదయానికి ఉన్నది ఒక్కటే
అందుకే, ప్రేమ నిండుకుందంటే చాలు
జీవితంలోని వెలుగంతా మటుమాయమౌతుంది.
.
ఫ్రాన్సిస్ విలియం బూర్డిలాన్
(22 March 1852 – 13 January 1921)
ఇంగ్లీషు కవీ, అనువాదకుడూ.
.

Image Courtesy: http://www.poemhunter.com/francis-william-bourdillon/
వ్యాఖ్యానించండి