(ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో)
నల్లరేగడి మీద నాగేటికర్రు విశ్రాంతి తీసుకుంటోంది
తిరగబడిన నల్లటిమట్టిపెల్లమీద మంచుముద్ద కూచుంది
శ్రమతో అలిసిన గుర్రం, తీరిగ్గా నెమరువేసుకుంటోంది
అదిగో రైతుకుర్రడు సూర్యోదయాన్ని తలెత్తి చూస్తున్నాడు.
మొగ్గతొడుగుతున్న దట్టమైన కంచె ఉదయకిరణాలవెలుగులో
అంచులంట బంగారు రంగు స్ఫటికాలతో మెరుస్తున్నాది
నిర్లక్ష్యంగా కనిపించే నగర గోపురాలమీద
ఏకైక సౌందర్యం అతనికోసం ప్రకాశిస్తోంది.
ఏ రోజుకి ఆ రోజు ఉదయాస్తమయాలు ఆవిష్కరించబడుతూ
కనులు చూడలేని అందాల్ని మనకి కనిపింపజేస్తాయి
తనగర్భంలో మహోన్నతమైన ఆ మాతృ స్వరూపం
శాశ్వతంగా ఆ పసిరూపాన్ని తీర్చిదిద్దుతోందో కదా!
.
(A.E.)
జార్జి విలియం రసెల్
10 April 1867 – 17 July 1935
ఐరిష్ కవి
.

Irish Poet
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:George_William_Russell_-_Project_Gutenberg_eText_19028.jpg
వ్యాఖ్యానించండి