విద్యుద్దీపం… టాం క్లార్క్ అమెరికను కవి

అదిలేకుండా పాపం మన పూర్వీకులు

ఎంత ఒంటరి జీవితం గడిపేవారో!

చీకటి చిత్తరువుల్లాంటి భయంకరమైన గుహల్లో

వెలుగుచొరని చలి ప్రదేశాలమధ్యా 

నలుగురూ నాలుగుపక్కలా పడుక్కుని

గుడ్డివాళ్లలా ఒకరి ముఖాలు ఒకరు

నవ్వితే పడే సొట్టలకోసమూ

ఆవేశాల ఆనవాళ్లకోసమూ సణుక్కుంటూ

తడుముకుంటుండేవారేమో. 

ఎంత విసుగెత్తే సంభాషణలు నడిచేవో వాళ్ళ మధ్య!

బహుశా

పాత కవిత్వం అంత నిరాసక్తంగా ఉండడానికీ

ప్రసిద్ధమైన వాటిలోని విషాదఛాయలకీ

కారణం సుదీర్ఘమైన దీపాలులేని

చీకటి రాత్రులనుండి రావడమేనేమో!

దీపాలతో పాటే హాస్యోక్తులూ వచ్చి ఉంటాయి.

వాళ్లచేతిలో ఒకవేళ గుండుసూది ఉండి

అది పడిపోతే ఎలా తీసేవారబ్బా?

రాత్రిపూట ఎలా భోజనం గొంతుదిగేదో ?

చీకటిపడ్డాక భోంచెయ్యడం ఎంత రక్తసిక్తం చెసేదో

దీపాలు ఆరిపోయేక

ప్రేమ కూడా అది ఉండవలసినరీతిలో ఉండేదికాదేమో

ఎందుకంటే,

ఒకదానికొకటి ఇచ్చిపుచ్చుకుంటేనే కదా

ఇంద్రియాలు కూడా తనివితీరేది  .

మనిషి  అది మోచెయ్యో, ముణుకో, లేక మేజాబల్లో

తెలుసుకోవాలనుకుంటాడు

స్నేహపూర్వకంగా చెయ్యి తట్టినపుడు

ప్రతిస్పందించడానికి.

ఒకప్పుడు రచయితలందరూ

అర్థరాత్రేకదూ ఏకాగ్రతతో రాసుకుంది

విద్యుద్దీపాల వెలుగులో నర్తించే

ఆవేశాల సీతాకోకచిలుక పొరపాటున మనమీదవాలితే 

ఆ విద్యుద్దీపం వెలుగులోనే కదా మనం

వాళ్లని అందుకోవాలనుకుంటే సమీపించవలసింది.

.

టాం  క్లార్క్ 

అమెరికను కవి

.

Artificial Light

.

Without it, what savage unsocial nights

Our ancestors must have spent!

All  those deadly

 Winter nocturnes in caves and unillumined icy

Fastnesses: they must have laid around and

Grumbled at one another in the dark like the blind,

Fumbling each other’s features for the wrinkle of a smile.

What  tedious repartee must have passed!

Perhaps

This accounts for the dullness of  much archaic

Poetry, whose somber cast is notorious and must

Have derived  from the traditions of those

 Long unlanterned nights.

Jokes came in with  candles.

How did they see to pick up a pin, if they

Had any?

How did they get dinner down?

Think of 

The mélange of chance carving that must have

Ensanguined dining after dusk!

Lights out,

Not even love’s what it’s cracked up to be.

The senses absolutely give and take

Reciprocally.

One wants to know whether that’s

An elbow, a knee, or the night table

Before one returns the favor of a friendly nudge.

Wasn’t it by the midnight taper all writers once digested

Their meditations?

By that same light we  ought

To approach them, if we ever expect to catch

The tiger-moth of  inspiration that dances

In the word  incandescent .

.

(From: Like Real People)

Tom Clark

(born March 1, 1941)

American Poet

Poem Courtesy: http://homepages.wmich.edu/~cooneys/poems/index.html