ఒక చెట్టునుండి ఆకు తీసుకో
దాని ఆకారం యథా తథంగా అనురేఖనం చెయ్యి
దాని అంచులూ
లోపలి గీతలూ
రెమ్మకి ఎలా అతుక్కుని ఉందో జ్ఞాపకం పెట్టుకో
(అలాగే, కొమ్మకి ఈ రెమ్మ ఎలా వాలి ఉందో కూడా)
అది ఎలా ఏప్రిల్ లో చిగురిస్తుందో
అదే జులై ఆగష్టు నెలాఖరు వచ్చేసరికి
ఎంత సర్వాంగసుందరంగా ఉంటుందో.
దాన్ని నీ చేతిలో నలిపి చూడు
అప్పుడు గ్రీష్మాంతవేళ
దాని విషాదాన్ని వాసనచూడొచ్చు;
దాని కాండాన్ని నమిలి చూడు
శరత్తులో గాలికి దాని గలగలలు విను
నవంబరు గాలికి అది ఆవిరైపోవడం గమనించు.
అప్పుడు చలికాలంలో
ఏ ఆకూ కనిపించనప్పుడు…
నువ్వొక ఆకుని సృష్టించు.
.
ఈవ్ మెరియం.
(July 19, 1916 – April 11, 1992)
అమెరికను.
.

Image Courtesy: http://www.poets.org/poet.php/prmPID/159
వ్యాఖ్యానించండి