నిర్లక్ష్యంచెయ్యబడ్డ తన కవితార్తిని
తీర్చుకుందికి ఉద్యమిస్తాడు ప్రాసకవి;
ధ్వని నీరసిస్తుంది, అర్థం అంతరిస్తుంది;
పెంపుడుకుక్క, తూర్పునుండి పడమర వరకూ
అతనిగుండెలో మండుతున్న భావోద్రేకాల్ని ప్రకటిస్తుంది.
మనోహరమైన ఆ ప్రదేశంలో ఉదయిస్తున్న చంద్రుడు
వినడానికి క్షణం ఆగి, అర్థంచేసుకుందికి తపిస్తుంటాడు.
.
ఏంబ్రోజ్ బియర్స్
( June 24, 1842; after December 26, 1913)
అమెరికను.
.

వ్యాఖ్యానించండి