ఫాదర్! జీవితం అంటే ఏమిటి?
“అది ఒక పోరాటం, బిడ్డా!
అందులో ధృఢమైన కత్తి కూడా పనికిరాకపోవచ్చు,
జాగరూకతగల కళ్ళు కూడా మోసపోవచ్చు
దిటవైన హృదయమైనా ధైర్యం కోల్పోవచ్చు.
అక్కడ అన్నిచోట్లా శత్రువులు చేతులుకలిపి
రాత్రీ పగలూ విశ్రమించరు.
పాపం అర్భకులైనవాళ్ళు ఎదురునిలిచి
భీకరపోరాటం మధ్యలో చిక్కుకుంటారు.
ఫాదర్! మృత్యువంటే ఏమిటి?
అది విశ్రాంతి, బిడ్డా!
బాధలూ, పోరాటాలూ ముగిసేక
సాధువూ, శాంతస్వభావుడైన దేవదూత
ఇక మనం పోరాడే పనిలేదని ప్రకటిస్తాడు;
అతను రాక్షసమూకలని తరిమివేసి,
యుద్ధపు హోరును ఆపమని శాసిస్తాడు.
బలహీనమై చేతిలోనుండి వాలుతున్న జండాలనీ,
ఆయుధాలనీ తీసుకుని శాశ్వత శాంతిని ప్రసాదిస్తాడు.
“నన్ను మరణించనీండి, ఫాదర్! ఆ భయంకరమైన
బాధలకీ తల ఒగ్గాలంటే నాకు భయంతో వణుకుపుడుతోంది.”
“తల్లీ, ఈ జీవిత రణరంగంలోనే
స్వర్గానికి కిరీటాన్ని గెలుచుకోవాలి;
బిడ్డా! నీ శత్రువులు బలవంతులూ, ఆరితేరినవారైనా
అతనికి బలహీనులూ, సామాన్యులంటేనే ప్రేమ.
దేవదూతలందరూ ఇప్పుడు నీ పక్షంలో ఉన్నారు
భగవంతుడు అందరికీ ప్రభువు.
.
ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్
(30 October 1825 – 2 February 1864)
అమెరికను.
.

- Image Courtesy: http://upload.wikimedia.org
వ్యాఖ్యానించండి