A Black Love Poem… Afsar, Telugu, Indian
1
Will you agree at least now
That there is no invisible love?
2
All that remained between us
were some apprehensions
And few insults still.
And after that
Either you shoot me
Or I shoot you.
3
No.
Faces of people
Are not just colourful flora
Or green foliage;
Neither woods, nor skies
Nor clouds nor mountains.
They are colours…
And at this moment
They are either white or black!
4
Can’t you declare, even now
That all our love and laughter
Was a mere masquerade?
That it is only veritable hatred?
5
After so many pages of history
And after several emotional journeys together
You remain ultimately one colour
And I … another.
That’s all!
6
Wasn’t it just mistrust…
That sufficed to chase and pull the trigger?
One look, just one look
To throw out your body
The life within
And the beats of its lively heart
Like a rot soiled quilt!
7
Will you admit
At least now,
Our love is dichromatic?
.
Afsar
.
Image Courtesy: http://www.afsartelugu.blogspot.in/
.
A Black Love Poem
1
ఇప్పటికైనా అనగలవా,
నైరూప్య ప్రేమలంటూ లేవని?
2
ఇంకా మన మధ్య మిగిలింది
కొన్ని అనుమానాలూ
అవమానాలూ
ఆ తరవాత నన్ను నువ్వో
నిన్ను నేనో కాల్చుకోడాలూ
పేల్చుకోడాలూ…
3
మనుషుల ముఖాలు
కేవలం
ఆకు పచ్చని ఆకులూ రంగు రంగుల పూలూ
అడవులూ ఆకసాలూ
మబ్బులూ కొండలూ కావు.
అవి కొన్ని రంగులు,
ఈ క్షణాన
అవి తెలుపూ నలుపూ!
4
ఇప్పటికైనా అనలేవా,
ఇవన్నీ నికార్సయిన ద్వేషాలే అని?
మన ప్రేమలూ నవ్వులూ
కప్పుకున్న ముఖాలే అని!
5
ఇన్ని చరిత్ర పేజీల తరవాత కూడా
ఇన్ని ఉద్వేగాల సహయానాల తరవాత కూడా
చివరికి నువ్వో రంగు
నేనో రంగు
అంతే!
6
వొక్క అనుమానమే చాలు కదా,
నిన్ను వేటాడి వేటు వేయడానికి!
వొక్క చూపే చాలు
నీ నిండు శరీరాన్ని
అందులోని నిండు ప్రాణాన్ని
ఆ ప్రాణంలోని నిండు గుండె చప్పుళ్ళని
మురికిపట్టి, చివికిపోయిన బొంతలా
అవతలకి విసిరి పారేయడానికి!
7
ఇప్పటికైనా అనగలవా
మన మధ్య ప్రేమలూ
రెండు రంగులేనని!?
.
అఫ్సర్
వ్యాఖ్యానించండి