అనువాదలహరి

నీ స్నేహానికి నా కృతజ్ఞతలు … లారీ ఎస్ చెంగెజ్

.

నామీద నాకే నమ్మకంలేక

సతమతమౌతున్నప్పుడు

నా మీద నమ్మకముంచినందుకూ…

నాతో ఏకీభవిస్తూ

నేను వినాలనుకున్నది కాకుండా…

నే నేది వినాలో అది చెప్పినందుకు కృతజ్ఞతలు.

 

నీ మనసు నాతో పంచుకున్నందుకూ

నీ ఆలోచనలూ, కలలూ, వైఫల్యాలూ

నన్ను నమ్మి, నాతో చెప్పుకున్నందుకూ…

నీ అవసరానికి నేను పనికొస్తానని విశ్వసించి,

అవసరంలో సాయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు.

 

మనస్నేహం  పెంపొందడానికి 

ఎంతో ముందుచూపూ, ఆలోచనా, శ్రద్ధా కనబరిచి

నాతో ఎన్నో మధురమైన క్షణాలను పంచుకుని

ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చినందుకు కృతజ్ఞతలు.

 

ఎప్పుడూ నాతో నిజాయితీగా ప్రవర్తించినందుకూ

నామీద ఎంతో అభిమానం కనబరిచినందుకూ

ఎప్పుడు అవసరమైనా నా అండగా ఉన్నందుకూ కృతజ్ఞతలు.

 

ఎన్నో అర్థవంతమైన రీతుల్లో

నాకు స్నేహితుడవై నిలిచినందుకు

నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

.

లారీ ఎస్ చెంగెజ్

.

Thank You for being My Friend

.

Thank you for believing in me

when I found it difficult

to believe in myself…

for saying what I’ve needed to hear sometimes,

instead of what I’ve wanted to hear…

for siding with me…

and for giving me another side to consider.

Thank you for opening yourself up to me…

for trusting me with your thoughts

and disappointments and dreams…

for knowing you can depend on me

and for asking my help when you’ve needed it.

Thank you for putting so much

thought and care and imagination

into our friendship…

for sharing so many nice times

and making so many special memories with me.

Thank you for always being honest with me

being kind to me…being there for me.

Thank you for being

a friend to me

in so many meaningful ways.

.

Larry S. Chengges

Poem Courtesy: http://www.smiles4u.ca/poetry/pmcheng.htm

%d bloggers like this: