నేను శృంఖలాల బద్ధుణ్ణి… అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్, రష్యను

ఓ గులాబి కన్నియా! నేను శృంఖలాల బద్ధుణ్ణి.

అయినా, ఈ బంధాల కాపలాదారులను చూసి సిగ్గుపడను;

దట్టమైన కొమ్మలగుబురులలో కోకిలకూడ బందీనే,

ఆ రెక్కల రేడు వనవాణికవులలో కలికితురాయి;

కంటికింపైన ఒక సొగసరి గులాబికి

చూపు మరల్చలేని మధురమైన దాస్యం చేస్తూ…

ఇంద్రియ నిగ్రహాలను సడలించగల చీకటి ముసుగు వివశతలో,

ఆమెకై లలితమధురమైన కుహుకుహూ రాగాలాలపిస్తుంది…

.

అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్

6 June  1799 – 10 February 1837

రష్యను

.

English: Alexander Pushkin
English: Alexander Pushkin (Photo credit: Wikipedia)

.

I am in Chains

.

I am in chains, O maiden-rose,
And yet, not shameful of these guards;
A nightingale, thus, – in dense laurels –
A feathered king of the woods’ bards,
A proud and charming rose over,
In a sweet bondage – lives for long
And softly sings for her a song
Under a sensual night’s cover.

.

Alexander Pushkin

(6 June [O.S. 26 May] 1799 – 10 February [O.S. 29 January] 1837)

Translated by Yevgeny Bonver, March 11, 2005

Poem Courtesy:

http://www.poetryloverspage.com/yevgeny/pushkin/i_am_in_chains.html

2 responses to “నేను శృంఖలాల బద్ధుణ్ణి… అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్, రష్యను”

  1. ‘ఆ రెక్కల రేడు వనవాణికవులలో కలికితురాయి’… అద్భుతం

    మెచ్చుకోండి

    1. ఫణీంద్ర గారూ,

      రసస్పర్శతో కూడిన మీ వ్యాఖ్యకి ఎన్నో ధన్యవాదాలు.

      అభివాదములతో

      మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.